ఎందుకీ దొంగబతుకు? 4 ఏటీఎంలలో ఒక్కటే ఓపెన్ కాలేదు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎందుకీ దొంగబతుకు? 4 ఏటీఎంలలో ఒక్కటే ఓపెన్ కాలేదు.. 

October 1, 2020

Nandyal atm machine money theft .

అదృష్టమే కాదు, దురదృష్టం కూడా నుదుటిపై లోతుగా రాసి పెట్టే ఉంటుంది. టైం బాగాలేకపోతే ఎంత ప్రయత్నించినా అనుకున్న పని పూర్తి కానే కాదు. ఏటీఎంలకు కన్నమేసి భారీగా డబ్బు దోచుకుందామని యత్నించిన దొంగలు ప్రస్తుతం ఇలా నొచ్చుకుంటున్నారు. వాళ్ల చోరీ చేయడానికి ట్రై చేసిన నాలుగు ఏటీఎంలలో ఒక్కటి కూడా తెరచుకోలేదు మరి. 

కర్నూలు జిల్ల నంద్యాల పట్టణంలో ఈ ‘విషాదం’ చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు పక్కా ప్లాన్‌తో పట్టణంలోని ఏటీఎంలపై రెక్కీ చేసి పనిలోకి దిగారు. గత అర్ధరాత్రి నంద్యాల చెక్‌పోస్టు దగ్గర్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్లి పగలగొట్టేందుకు యత్నించారు. అది తెచుకోలేదు. అంతేకాకుండా అక్కడి సీసీకెమెరాల్లో ఇద్దరూ పడిపోయారు. తర్వాత పాత ఆర్డీవో కార్యాలయం దగ్గరున్న ఏటీఎంలో ట్రై చేశారు. అదీ మొరాయించడంతో మాధవీనగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లారు. అక్కడ కూడా చుక్కెదురైంది. ఇక చివరి ఆశగా గాయత్రి ఎస్టేట్‌లో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంకు హోల్ పెట్టబోయారు. అక్కడా దురదృష్టం వెంటాడింది. ఇక తెల్లారేలా ఉందని, తర్వాత చూసుకుందామని వెళ్లిపోయారు. ఏటీఎంల ఫుటేజీని పరిశీలించి బ్యాంకులు సిబ్బంది చోరీయత్నాలపై పోలీసులకు ఫిర్యాదు  చేశారు. దొంగల కోసం గాలిస్తున్నామని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.