నంద్యాలలో టీడీపీకి చుక్కెదురు.. - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాలలో టీడీపీకి చుక్కెదురు..

August 19, 2017

 

రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎదురుదెబ్బ తగింది. తమ నాయకులను టీడీపీ ఆదేశాలతో పోలీసులు వేధిస్తున్నారన్న  వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై ఎన్నిక సంఘం స్పందించింది. డీఎస్పీ గోపాలకృష్ణ  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదును పరిశీలించిన ఈసీ ఆయనను బదిలీ చేసింది. గోపాలకృష్ణ స్థానంలో ఓఎస్డీ రవిప్రకాశ్ బాధ్యతలు చేపడతారు.

మరో నాలుగు రోజుల్లో పోలింగ్ జరగనుందగా డీఎస్పీపై వేటుపడటం టీడీపీకి పెద్ద షాకే.  ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారని పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ లు.. రెండూ అక్రమాల విషయంలో దొందూ దొందేనని పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికల్లా జరగాల్సిన నంద్యాల  ఎన్నికలను రెండు పార్టీలూ ప్రతిష్టకు తీసుకోవడంతో వివాదాలు ముదురుతున్నాయి.

డబ్బు, మద్యం, ఇతర తాయిలాలను రెండు పార్టీలూ పంచుతున్నాయి. టీడీపీ అధికార పార్టీ కాబట్టి ఈ విషయంలో దానిదే పైచేయిగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరుపుతున్న పోలీసులు టీడీపీ అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు..