Nandyal polic constable
mictv telugu

ఏపీలో ఘోరం.. పోలీసును పొడిచి చంపేశారు..

August 8, 2022

ఏపీలో ఘోరం జరిగింది. నంద్యాల పట్టణంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పాత నేరస్తులు దారుణంగా పొడిచి చంపేశారు. ఈ హత్యకు కారణాలేమిటో తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. డీఎస్పీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న గూడూరు సురేంద్రకుమార్‌ (37) ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. రాజ్‌ థియేటర్‌ దగ్గర ఆరుగురు పాతనేరస్తులు అడ్డగించాడు. తర్వాత ఓ ఆటోలో ఎక్కించుకుని చిన్నచెరువు దగ్గరికి వెళ్లి కత్తులతో పొడిచి వదిలేశారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న సురేంద్రను ఆటో డ్రైవర్‌ అలాగే పోలీసు స్టేషన్‌కు దగ్గరికి తీసుకెళ్లాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. సురేంద్రను ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని, నేరస్తులు పగతో చంపి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.