నంద్యాల బై పోల్...టెన్షన్...టెన్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

నంద్యాల బై పోల్…టెన్షన్…టెన్షన్

August 22, 2017

నంద్యాల ఉప ఎన్నికల ఎన్నికల టెన్షన్ మరింత పెరిగింది. ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది. నెల రోజుల పాటు అధికార,  విపక్షాలు కాలికి బలపం కట్టుకుని  నియోజకవర్గం తిరిగాయి. కులాల వారిగా, మతాల వారిగా, ఏరియాల వారిగా నియోజకవర్గాన్ని డజన్ల సారు చుట్టి వచ్చారు. ఎవరి ఎత్తులు వారికున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా  వారిదే.  కేవలం కష్టాన్ని మాత్రమే కాదు… ఇరు పార్టీల నాయకులు కాసులపై మరింత  ఆధారపడ్డారని నంద్యా లనుండి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎవరెంత పంచారనే విషయంలో కూడా పోటీలు పడుతున్నారని వార్తలు గుప్పు మంటున్నాయి.

ఇంకో వైపు  ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు నంద్యాలలోమోహరించాయి. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా  ఎన్నికల  కమిషన్  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది. సీసీ కెమెరాలో పాటు డ్రోన్ కెమెరాలు కూడా వాడుతున్నారట.  సమస్యాత్మకం, అతి సమస్యాత్మక పోలింగ్  కేంద్రాలే  ఎక్కువగా ఉన్నాయి.101 పోలింగ్ కేంద్రాలు, 250 వరకు పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.వీటి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నంద్యాల పట్టణంతో  పాటు  రూరల్,  గోస్పాడు మండలాల్లో పోలీసు బలగాలు మోహరించారు.

ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో జరుగుతున్న ఈ ఎన్నికను ఎన్నికల కమిషన్ కూడా అంతే సీరియస్ గా తీసుకున్నది. డబ్బుల పంపిణీని అడ్డుకునేందుకూ చర్యలు తీసుకుంటున్నది. ప్రత్యేకాధికారులు కూడా నంద్యాలలో తిష్ట వేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.  ఇంకొద్ది గంటల్లో ప్రారంభం  అయ్యే పోలింగ్  కోసం నాయకులు  నిద్రాహారాలు మాని తిరుగుతూనే ఉన్నారు. ఇంటింటి ప్రచారం ముగిసినా…. సెల్ ఫోన్ల ద్వారా పరిస్థితిని ఫాలో అప్ చేస్తున్నారు.

ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం  ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగతుంది. గంట గంటకు ఎంత పోలింగ్ నమోదైందనే విషయాన్ని ఎన్నికల అధికారులు  అప్ డేట్ చేస్తారు. ఈ నెల 28న  కౌంటింగ్  ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా  చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నా దాని గురించి అంతగా పట్టింపు లేదు. ఇటు పార్టీలు, అటు జనంలో కూడా ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ ఉంది. పోలింగ్ పర్సేంటేజీని బట్టి  గెలుపెవరదనే దానిపై అంచనాకు రావొచ్చని అంటున్నారు.