పిల్లలు చూస్తున్నారు, ఇక చాలు.. నాని ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలు చూస్తున్నారు, ఇక చాలు.. నాని ట్వీట్

March 27, 2018

టీవీ చానళ్లలో యాంకరింగ్ పేరుతో దొర్లిస్తున్న పచ్చిబూతులపై నేచురల్ స్టార్ నానికి కోపమొచ్చింది. సినీ పరిశ్రమను, అందులోని వ్యక్తులను కించపరుస్తూ చేస్తున్న వ్యాఖ్యలపై అతడు మండిపడ్డారు. మీడియా మార్గదర్శకంగా ఉండాలని, ప్రతి విషయాన్ని భూతద్దంలోంచి చూపుతూ, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దని కోరుతూ ట్వీట్ చేశారు.

‘సినీ పరిశ్రమను కించపరుస్తూ నిరంతరం టీవీ చానళ్లు, యాంకర్లు, యూట్యూబ్ చానళ్లు బురదచల్లడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మన మీడియా భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుపెట్టుకోండి. పిల్లలు చూస్తున్నారు. ఇక చాలు.. ఆపండి..’ అని కోరారు. ఇటీవల టీవీ 5 చానల్ సాంబశివరావు.. సినీపరిశ్రమను విమర్శిస్తూ.. లంజముండలు అని దూషించడం తెలిసిందే. దీనిపై కేసు కూడా నమోదైంది.