నాని అప్పుడు...ఇప్పుడు..! - MicTv.in - Telugu News
mictv telugu

నాని అప్పుడు…ఇప్పుడు..!

July 31, 2017

 

కష్టపడ్డోనికి విజయం ఎప్పుడూ వెంటే ఉంటుంది ,అది నానీ ని చూస్తే మనకు ఈసీ గా అర్ధమవుతుంది,చూస్తున్నురా గా ఈ ఫోటో శ్రీకాంత్,స్నేహ నటించిన రాధాగోపాళం సినిమాకి  డైరెక్టర్ బాపూ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు నాని,2005లోని  ముచ్చట ఇది, మరి 2017 లో నేచురల్ స్టార్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు,అష్టా చమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యి డిఫరెంట్ కథలు సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు

నాని.సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నాని ఈ స్ధాయికి వచ్చాడంటే కారణం ఒక్కట్టే  కష్టం..మొదట్లో అవకాశాలకోసం ఆయన పడ్డ శ్రమ,వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవడం,..ఎదిగిన కొద్ది ఒదుగుతూ ఉండడం,ఇవే నానీని ఈస్ధాయిలో నిలబెట్టాయి.నేను లోకల్ నిన్నుకోరి అని వరుస హిట్స్ కొట్టిన నాని ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఎంసి ఎ అనే చిత్రం చేస్తున్నాడు,ఇందులో  ఫిదా ఫేమ్ సాయిపల్లవి  నానీతో జోడి కట్టనుంది.