రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదటహో.. అది రోకా వేడుకట - MicTv.in - Telugu News
mictv telugu

రానాకు​ ఎంగేజ్​మెంట్​ కాలేదటహో.. అది రోకా వేడుకట

May 22, 2020

Rana

టాలీవుడ్ హీరో రానా నిశ్చితార్థంపై ఇటీవల రకరకాల కథనాలు వచ్చాయి. కొందరు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని, మరి కొందరు కాదంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల రెండు కుటుంబాల వారు కలిసి పాల్గొన్న ఓ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా ఇందుకు బలం చేకూర్చాయి. ఈ విషయం తెలిసిన హీరో నాని దీనిపై ఆరా తీశారు. ఏకంగా నిర్మాత సురేష్ బాబుతో ఆయన వాట్సాప్ ద్వారా సంబాషణలు జరిపారు. ఈ సందర్భంగా రానాకు నిశ్చితార్థం జరగలేదని తేలింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా నాని షేర్ చేశాడు. 

వాట్సాప్‌ ద్వారా రానాకు నిశ్చితార్థం జరిగిందా అంటూ సురేష్ బాబును అడగ్గా.. అలాంటిదేమి లేదని అది రోకా వేడుక అంటూ బదులు ఇచ్చారు. అవునా, అదేంటి..ఆ వేడుక గురించి గూగుల్‌ చేస్తా అంటూ మరో రిప్లే ఇచ్చారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి పూర్తి క్లారిటీ ఇచ్చారు. అమ్మాయి విహీకా బజాజ్ కుటుంబ సంప్రధాయమని పేర్కొన్నారు. ఉత్తర భారత దేశంలో పెళ్లికి ముందు రోకా కార్యక్రమం చేస్తారట.వధూవరుల కుటుంబాలు కలిసి నిశ్చితార్థం, పెళ్లి గురించి మాట్లాడుకునే సందర్భం అన్న మాట. ఈ సమయంలో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సాధారణ ప్రక్రియ. అందులో భాగంగానే రోకా చేశామని, అది నిశ్చితార్థం కాదని చెబుతున్నారు. మొత్తానికి నాని చొరవతో దీనిపై వస్తున్న కథనాలకు ఫుల్ స్టాప్ పడిందన్నమాట.