నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న నాని ఈసారి తన కెరీర్ లో కొత్త క్రేజ్ అందుకోవడానికి సిద్ధమయ్యాడు. డిఫరెంట్ లుక్ తో రఫ్ టఫ్ గా కనిపిస్తున్న నాని తన కెరీర్ లోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా చేయలేదు. దసరా అనే పేరుతో తెలుగు వాళ్ళ ముందుకు వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు పాజిటివ్ వైబ్సే క్రియేట్ చేసింది.
కేవలం టీజర్ తోనే మార్కెట్లో ఈ సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడింది. పాన్ ఇండియా అరేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. ఇప్పుడు ఇది యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. అంచనాలను స్థాయిని మరింత ఎక్కువగా పెంచేసింది. చుట్టూ బొగ్గు గనులు దాని మధ్యలో ఉండే ఒక చిన్న గ్రామంలో నాని అలాగే అతని ప్రేయసి వెన్నెల సాగే ప్రేమ కథే దసరా సినిమా. చూడ్డానికి అయితే తమిళ సినిమాల్లా ఊరనాటుగా ఉంది ట్రైలర్ లో. నాని మాటలు, యాక్షన్ కూడా అలాగే ఉంది.అలాగే ఆ ఊరికి వచ్చిన సమస్య ఏంటి? అల్లరి చిల్లరగా తిరిగే హీరో చివరికి ఊరి కోసం ప్రేమ కోసం ఏ విధంగా నిలబడ్డాడు అనే పాయింట్స్ సినిమాలో హైలెట్ గా కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ట్రైలర్ మొదట్లోనే కీర్తి సురేష్ మాత్రం అల్లరిగా ఉండబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.
ఇక హీరో ధరణి పాత్రలో నాని మంచోడే కానీ అనవసరంగా మధ్యానికి బానిసై ఇతరులను కొడుతూ తిరుగుతూ ఉంటాడు. ఇక అతని ఇంట్లో బామ్మ వద్దని నెత్తి నోరు మొత్తుకున్నా కూడా అనవసర గొడవల కోసం కత్తి పట్టినట్లుగా అనిపిస్తోంది. అసలు ధరణి జీవితంలో ఎలాంటి అలజడి క్రియేట్ అయ్యింది అనే విషయాలు ఈ సినిమాలో హైలెట్ అంశాలుగా కనిపిస్తున్నాయి.ఇక నాని యాస ఈ సినిమాలో మరింత హైలెట్ గా నిలవబోతోంది. నోట్లో బీడీ పట్టుకుని మరోవైపు చేతిలో మందు సీసాతో కనిపించిన నాని చొక్కా లుంగి అసలు ఒక పద్ధతిలో లేని గడ్డం జుట్టు ఇలా అన్నీ బోల్డ్ గా ఉన్నాయి.
ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం ఇచ్చాడు. ట్రైలర్ వనకు అయితే వినడానికి బావుంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి. దసరా సినిమాను మార్చి 30వ తేదీన తెలుగు,తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.