డిజిటల్ స్టార్ నాని - Telugu News - Mic tv
mictv telugu

డిజిటల్ స్టార్ నాని

July 3, 2017


‘ నిన్నుకోరి ’ సినిమాతో ఫ్రెష్షుగా వస్తున్న నాచురల్ స్టార్ నాని గురించి మనం ఎంత చెప్పుకున్నా డిజిటల్ మీడియా అంత ఎక్కువైతే చెప్పుకోలేం. అవును నిజం.. నానీకి డిజిటల్ మీడియాలో వున్న ఫాలోయింగ్ మామూలుది కాదు.

ఏ హీరోకి లేనంత ఫాలోయింగ్ వుంది. మహేష్, జూనియర్ ఎన్ టీఆర్, ప్రభాస్ లను మించిన ఫాలోయంగ్ వుంది నానీకి. నాని కూడా ఎప్పడూ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా వుంటాడు. ఎప్పటికప్పుడు తన మనో భావాలను ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రగామ్ వేదికగా అప్ డేట్ ఇస్తుంటాడు. అందుకే తనకి ఇంత ఫాలోయింగ్ వుందంటున్నారు నెటిజనులు.