నాని-నాగ్  కలిసి  నటిస్తే ? - MicTv.in - Telugu News
mictv telugu

నాని-నాగ్  కలిసి  నటిస్తే ?

September 11, 2017

నాచురల్ స్టార్ నాని, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి భలే మంచి రోజు, శమంతకమణి  డైరెక్టర్  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మల్టీ స్టారర్ కథను నిర్మాత అశ్వనీదత్ కు వినిపించాడట డైరెక్టర్ ఆదిత్య. అయితే నిర్మాత అశ్వనీదత్ కు ఆ కథ బాగా నచ్చిందట. నాగార్జున ,నానీలు కూడా కథకు ఒకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈసినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. మొత్తానికి  మరో కొన్ని రోజుల్లో  టాలీవుడ్  లో మరో మల్టీ స్టారర్ సినిమా చూడబోతున్నామన్నమాట.