nani-open-up-about-nepotism-in-nijam-with-smita-show, telugu
mictv telugu

నెపోటిజాన్ని ప్రేక్షకులే పెంచిపోషిస్తున్నారు-నాని

February 22, 2023

nani-open-up-about-nepotism-in-nijam-with-smita-show

సినీ పరిశ్రమ అంటేనే నెపోటిజం అన్నట్టు తయారయ్యింది. దానికి తగ్గట్టే వారసులే ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నారు కూడా. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా దీనికి అతీతం కాదు. అదే మాట అంటున్నారు హీరో నాని. సింగర్ స్మిత హోస్ట్ గా చేస్తున్న టాక్ షో నిజం లో నాని ఈ మాట అనడం చర్చకు దారితీస్తోంది. నిజం టాక్ షోకి మంచి పేరు వస్తోంది. ఇందులో వచ్చే సెలబ్రిటీల సమాధానాలు చాలా కాంట్రవర్శీ అవుతున్నాయి. మొదట సాయిపల్లవి మాటలు కూడా ఇలాగే చాలా రోజులు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నాని మాటలు. నాని, రానా మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పడు ఈ టాక్ షోకి కూడా వీళ్ళిద్దరూ గెస్ట్ లుగా కలిసి వచ్చారు.

అందరినీ అడిగినట్టే స్మిత నాని, రానాలను కూడా కాంట్రవర్శీ ప్రశ్నలు అడిగింది. దాంట్లో ఒక ప్రశ్నే నెపొటిజం గురించి. దీనికి సమాధానంగా నాని మాట్లాడుతూ నా మొదటి సినిమాను లక్ష మంది చూస్తే, రామ్ చరణ్ సినిమానుకోటి మంది చేశారు. అలా చూసిన వాళ్ళఉ కాదా నెపోటిజం ను ప్రోత్సహిస్తున్నది అంటూ సమాధానం చెప్పాడు. అయితే ఇదే ప్రశ్నకు రానా మరో విధంగా సమాధానం చెప్పాడు. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత పిల్లల మీద ఉంటుంది. వారిని మరో గొప్ప స్థాయికి తీసుకెళ్ళాలి. అప్పుడే పిల్లలు విజయం సాధించినట్టు. అలా చేయకపోతే అన్నికాలుగా మాటలు పడాల్సి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

అసలు స్మిత ఏం అడిగింది…రానా, నాని ఏం చేప్పారో తెలియాలంటే, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేవరకూ ఆగాల్సిందే. ప్రస్తుతం నాని దసరా అనే సినిమా చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా మాత్రం ఏం సినిమాలు ఒప్పుకోలేదు.