Home > Featured > కోరమీసంతో నాని, డ్యాన్స్‌తో కార్తికేయ.. మామూలుగా లేరుగా

కోరమీసంతో నాని, డ్యాన్స్‌తో కార్తికేయ.. మామూలుగా లేరుగా

Nani with mustache, dancing with Kartikeya

లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు లేక సినిమా తారలందరూ తమ తమ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇన్నిరోజులు షూటింగులు, ప్రమోషన్లతో బిజీబిజీగా ఉన్న వారందరికీ ఇప్పుడు బోలెడంత సమయం లభించింది. దీంతో ఏ టెన్షన్ లేకుండా చక్కగా కుటుంబాలతో సమయం వెచ్ఛిస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ తాజా అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా నాచురల్ స్టార్ నాని తన యుక్త వయసులో ఉన్నప్పుడు అక్కతో దిగిన ఫోటోను పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆ ఫోటోను షేర్ చేశాడు. దీంతో ఈ ఫోటోను నాని అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు. ‘నూనూగు మీసాల ఏజులో నాని’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలావుండగా యంగ్ హీరో కార్తికేయ ఓ అదిరిపోయే స్టెప్పు వేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని ఫాలో ఫాలో మీ పాటకు డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేసి ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ వీడియోపై ఎన్టీఆర్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలావుండగా అన్నీ భాషా చిత్రాల నటీనటులు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో అభిమానులను పలకరిస్తున్నారు. అమితాబ్, తాప్సీ, మహేశ్, ఊర్వశీ రౌతేలా వంటివారు తమ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు.

Updated : 21 May 2020 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top