నానీని మెచ్చిన కేటిఆర్ ! - Telugu News - Mic tv
mictv telugu

నానీని మెచ్చిన కేటిఆర్ !

July 10, 2017

నాచురల్ నటనతో ఆకట్టుకునే నానీ మీద ఇప్పుడు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రశంసా పూర్వకంగా ట్వీట్ చేశారు. ‘ నిన్నుకోరి ’ సినిమా చూసిన మంత్రిగారు సినిమాలో నానీ నటనకు మంత్ర ముగ్దులైనట్టున్నారు. అందుకే నానీని ట్విట్టర్ సాక్షిగా మెచ్చుకోలేక వుండలేపోయారు. ఈ ప్రశంస నిజంగా నానీకి చంద్రునికో పట్టు వస్త్రం లాంటిదే. ఇప్పటికే ఏ హీరోకి లేనంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ నానీకి వుంది. డిజిటల్ స్టార్ గా, దేశీ హీరోలా, పక్కింటి పిల్లాడిలా అన్పించే నానీ నటన చాలా అద్భుతంగా వుంటుందని వేరే చెప్పక్ఖర్లేదు. నానీ ఏ సినిమా చేసినా చాలా సెలెక్టెడ్ గా కథలను ఎంచుకొని ముందుకు పోతున్నాడు కాబట్టే ఇలా పెద్దవాళ్ళ మెప్పును పొందుతున్నాడు.