‘అంటే సుందరానికి..‘ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. సినిమా ఓటీటీ విషయంలో అధికారిక ప్రకటన వెలుబడింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 10న స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ వెర్షన్‌లు ఒకే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ మేరకు అంటే సుందరానికి సినిమా పోస్టర్ ని షేర్ చేసి..”సుందర్ అండ్ లీల వెడ్డింగ్ స్టోరీని చూసేందుకు మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తేది గుర్తుంచుకోండి” అంటూ ట్వీట్ చేసింది నెట్‌ఫ్లిక్స్. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్నా.. కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే అంశాలు ఎలాంటివి ఇందులో లేకపోవడంతో ఓ వర్గపు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదు. థియేటర్స్‌లో టికెట్ రేట్స్ కూడా ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది.
‘అంటే సుందరానికీ’’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 19 కోట్ల షేర్ (రూ. 33.05 కోట్లు గ్రాస్ ) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా ఈ సినిమా బయ్యర్స్‌కు రూ. 11 కోట్ల నష్టాలను మిగిల్చింది. కానీ అమెరికాలో ఈ సినిమాతో మరోసారి 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి వరుసగా ఏడు సినిమాలతో రికార్డ్ సాధించాడు నాని. మొత్తంగా సినిమా విషయంలో నిర్మాతలు సేఫ్‌లోనే ఉన్నారని, కానీ డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.