అంతరిక్షంలో చెత్తకు పరిష్కారం.. అక్కడే కాల్చేసే కొత్త పరికరం
Editor | 15 July 2022 3:20 AM GMT
అంతరిక్షంలో రోజురోజుకీ ఉపగ్రహాలను ప్రయోగించే కొద్దీ చెత్త కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. ఆస్ట్రోనాట్స్ వల్ల ఏడాదికి 2,500 కిలోల చెత్త పేరుకుపోతోంది. ఇప్పటివరకు అక్కడి చెత్తను స్పేస్ కార్గో వెహికిల్స్ ద్వారా భూమికి రప్పించేవారు. దీంతో ఈ ప్రాసెస్‌కు అధిక వ్యయంతో పాటు సమయం ఎక్కువ పట్టేది. దీనికి పరిష్కారంగా అమెరికా హ్యూస్టన్‌కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ నానో ర్యాక్స్ ఓ పరికరాన్ని తయారు చేసింది. దీని ద్వారా అక్కడి చెత్తను అక్కడే మండించేలా చేయవచ్చు. బిషప్ ఎయిర్ ల్యాక్స్ అనే పరికరంతో ఒకేసారి 600 పౌండ్లు అంటే సుమారు 272 కిలోల చెత్తను మండించవచ్చు. దీనిని ఎప్పటికప్పుడు అంతరిక్షంలోకి పంపించి, తిరిగి స్పేస్ సెంటరుకి చేరుకుంటుంది. ఈ పరికరాన్ని విజయవంతంగా పరీక్షించినట్టు నానో ర్యాక్స్ కంపెనీ తెలిపింది.
Updated : 15 July 2022 3:20 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire