నారా భువ‌నేశ్వ‌రికి అపాయం పొంచి ఉంది - రోజా - MicTv.in - Telugu News
mictv telugu

నారా భువ‌నేశ్వ‌రికి అపాయం పొంచి ఉంది – రోజా

December 21, 2021

04

నారా చంద్ర‌బాబు వ‌ల్ల ఆయ‌న‌ భార్య భువ‌నేశ్వ‌రికి అపాయం పొంచి ఉందని, జాగ్ర‌త్త‌గా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున వరద బాధితులకు నారా భువనేశ్వరి రూ. లక్ష ఆర్ధికసాయం అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె ఆడవారిని క్షోభపెడితే బాగుపడరని చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందించారు. ఈ సందర్భంగా రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘నిజ‌మే అమ్మా.. ఎవ‌రైతే ఆడవారిని ఏడిపిస్తారో, కుట్ర‌లు చేసి వారిని తొక్కేయాల‌ని చూస్తారో అటువంటి వారు వారి పాపాన వారే పోతారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో 23 అసెంబ్లీ స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఎన్టీఆర్‌ను ఏడిపించారు.

ఆయ‌న‌పై చెప్పులు విసిరారు. ఎన్టీఆర్‌ను ఏడిపించారు. ఆయ‌న‌ను ఏడిపించిన వారు ఎలా క‌నుమ‌రుగు అయ్యారో కూడా మ‌నం చూశాం’ అని రోజా చెప్పారు. ‘జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో మ‌హిళ‌లు సంతోషంగా ఉన్నారు. చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వ హ‌యాంలో మాత్రం మ‌హిళ‌లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పుష్క‌రాల స‌మ‌యంలోనూ షూటింగ్ పిచ్చికి అనేక మంది చ‌నిపోయారు. నారాయ‌ణ జూనియ‌ర్ కాలేజీలో ఆడ‌పిల్ల‌ల‌కు అన్యాయం జ‌రిగింది. గ‌తంలో నాకూ టీడీపీలో అవ‌మానాలు జ‌రిగాయి’ అని రోజా వ్యాఖ్యానించారు. అనంతరం ‘చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది. భువనేశ్వరి ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాలి. చంద్రబాబు రాజ‌కీయ ల‌బ్ధి కోసం మామ‌నే కాదు భార్య‌నూ చంద్ర‌బాబు ప్ర‌మాదంలో పెడ‌తారు. చంద్ర‌బాబు వ‌ల్లే మీకు అపాయం పొంచి ఉంది. మీరు జాగ్ర‌త్త‌గా ఉండండి అని అన్నారు.