టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను :లోకేష్
కార్యకర్తలకు కష్టం వస్తే చూస్తూ ఊరుకోనని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టమని హెచ్చరించారు. అమలాపురంలో ఉన్నా, అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తామన్నారు. పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉందన్నారు లోకేష్. మహానాడులో భాగంగా మాట్లాడిన ఆయన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్ ఆగడు.. కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడని ఎద్దేవా చేశారు.యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగిస్తే.. తాను అంబేడ్కర్ రాజ్యాంగంతో సమాధానం చెప్పానన్నారు. టీడీపీకి ఘనమైన చరిత్ర ఉందని..వైసీపీ మాత్రం గలీజు పార్టీ అని విమర్శించారు. రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు పేదవాడా? లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అనిలోకేష్ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నదే టీడీపీ లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు.