మీ పిల్లలు ఏ మీడియంలో చదివారు?: జగన్‌కు లోకేశ్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మీ పిల్లలు ఏ మీడియంలో చదివారు?: జగన్‌కు లోకేశ్ కౌంటర్

November 11, 2019

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌, ప్రతిపక్షనేత చంద్రబాబులపై వ్యక్తిగత విమర్శలు చేశారు. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, ప్రతిభావంతులకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…నారా దేవాన్షు, పవన్ కళ్యాణ్ పిల్లల చదువులపై విమర్శలు చేశారు. వారు ఏ మీడియంలో చదువుతున్నారో తెలపాలన్నారు.

సీఎం గారి పవర్ ఫుల్ పంచ్ :సినిమా యాక్టర్ పవన్‌ కల్యాణ్‌ గారు…మీకు ముగ్గురు భార్యలున్నారు , నలుగురో , ఐదుగురో పిల్లలు ఉన్నారు , వారిని ఏ మీడియంలో చదివిస్తున్నారు..?◆ బాబు, వెంకయ్యనాయుడు మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారు…?

Posted by Nagarjuna Yadav Yanamala on Sunday, 10 November 2019

దీనిపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. ఏపీ సీఎం జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని ఉద్యమం చేసినప్పుడు సీఎం జగన్ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారా? అని నిలదీశారు. ‘అయ్యా గజిని జగన్ గారు.. మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తు లేదా? నగర పాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ రోజు మీరు అడ్డుపడ్డారు’ అని ట్వీట్ చేశారు. ”ఎందుకింత తెగులు?’, ‘తెలుగు లెస్సేనా?’ అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? జగన్ గారూ! ‘ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు’ అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.