Nara Lokesh criticized CM Jagan
mictv telugu

సీఎం జగన్ పిల్లి నా కొడుకు : నారా లోకేష్

October 20, 2022

Nara Lokesh criticized CM Jagan

టీడీపీ యువ నేత నారా లోకేష్ వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌పై గురువారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పిల్లి నా కొడుకు అని, ఆయన బయటికి వస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేస్తారా? అని ప్రశ్నించారు. యూ1 భూమి సంగతి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎనిమిదిన్నరేళ్లుగా ఈయన చేసిందేంటి? ఎంత మంది పేదలకు ఇళ్లు ఇచ్చారు? నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారు. కేటాయించిన నిధులు వినియోగించక మురిగిపోలేదా? అని వరుస ప్రశ్నలు వేసారు. లా అండ్ ఆర్డర్‌ని వదిలేసి గాలికి తిరుగుతున్నారని విమర్శించారు. అటు కరోనా సమయంలో వేల మందికి మంగళగిరిలో చికిత్స అందించామని, టెక్నాలజీని వాడి విదేశీ వైద్యులతో టెలీ మెడిసిన్ ద్వారా సలహాలు ఇప్పించామని తెలియజేశారు. పలువురు తోపుడు బండ్ల వ్యాపారులకు చేయూతనిచ్చామని వెల్లడించారు.