nara lokesh intresting commnest on chiru,pavan and jr.ntr political entry
mictv telugu

జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ, చిరు, పవన్‌పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

February 25, 2023

nara lokesh intresting commnest on chiru,pavan and jr.ntr political entry

వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం తిరుపతిలో పర్యటించిన ఆయన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువత సంధించిన ఆసక్తికర ప్రశ్నలకు లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

జూ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా ?

జూ. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సమావేశంలో లోకేష్ మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని యువత అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. ” ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రంలో మార్పు రావాలి, ఈ రాష్ట్రం అగ్ర స్థానానికి వెళ్ళాలి, ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలి అని ఆశిస్తారో వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి” అని చెప్పారు.

చిరు, పవన్‌పై

మీ అభిమాన హీరో ఎవరు అన్ని ప్రశ్నకు మెగాస్టార్ చిరంజీవి అని లోకేష్ జవాబిచ్చారు. “నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మ‌ద్దుల మామ‌య్య‌. విడుద‌లైన మొద‌టి రోజు, మొద‌టి షోనే బాలయ్య సినిమాలు చూస్తాను” అని లోకేశ్‌ అన్నారు. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే ముందు మంచి మనసు ఉండాలని.. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌లో ఆ మంచి మనసును చూశానన్నారు. ఇలాంటివారు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలన్నారు. 2024 ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగేందుకు టీడీసీ సిద్ధమవుతున్న సమయంలో మెగాబ్రదర్స్‌ను నారా లోకేష్ కొనియాడడం ఆసక్తికరంగా మారింది.