ఒక్కరోజులో 7 రోడ్లు నిర్మించిన నారా లోకేష్.. పిక్స్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్కరోజులో 7 రోడ్లు నిర్మించిన నారా లోకేష్.. పిక్స్ వైరల్

November 17, 2022

టీడీపీ యువ నేత నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఒక్క రోజులోనే యుద్ధప్రాతిపదికన ఏడు రోడ్లు వేయించి ప్రజల ఇబ్బందులు తొలగించారు. మంగళగిరి నియోజకవర్గంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఈ నెల 15న పాల్గొన్న లోకేష్‌కి పోల్కంపాడు దేవుని మాన్యం ప్రజలు తమ రోడ్ల దుస్థితిని చూపించారు. దీంతో స్పందించిన లోకేష్.. ఈ దుర్మార్గ ప్రభుత్వం అడ్డుకోకుండా ఉంటే 48 గంటల్లో రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.

చెప్పిన గడువు కంటే 24 గంటల ముందే ముళ్లపొదలు, గుంతలతో కూడుకున్న రోడ్లకు మరమ్మత్తులు చేయించారు. పిచ్చిమొక్కలను క్లియర్ చేయించి, గుంతలు పూడ్చి కంకర్ చిప్స్‌‌తో ఏడు రోడ్లను నిర్మించారు. తమ ఇళ్లు కూలగొట్టడానికి జగన్ రెడ్డి జేసీబీలు పంపుతుంటే.. తమ ఇళ్లకు దారి వేసేందుకు లోకేష్ జేసీబీలు పంపారంటూ దేవుని మాన్యం ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సొంత డబ్బు వెచ్చించి వెంటనే పరిష్కరించిన లోకేష్‌‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.