దుగ్గిరాల హత్యాచార బాధిత ఫ్యామిలీకి లోకేష్ ఆర్ధిక సాయం - MicTv.in - Telugu News
mictv telugu

దుగ్గిరాల హత్యాచార బాధిత ఫ్యామిలీకి లోకేష్ ఆర్ధిక సాయం

May 23, 2022

మంగళగిరి నియోజకవర్గ దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఇటీవల హత్యాచారానికి గురైన తిరుపతమ్మ కుటుంబానికి నారా లోకేష్ ఆర్ధిక సహాయం చేశారు. టీడీపీ పార్టీ తరపున రూ. 5 లక్షలు వారి పిల్లల పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ మేరకు బాధిత ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. డిపాజిట్లకు సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఓ సోదరుడిలా ఆదుకుంటానని వారికి హామీ ఇచ్చారు.

లోకేష్ రావడంతో మండలంలోని ఇతర టీడీపీ నాయకులు ఆయన వెంట వచ్చారు. కాగా, గత నెలలో తిరుపతమ్మ తన ఇంటిలోనే హత్యాచారానికి గురైంది. ఈ విషయం తెలిసి లోకేష్ అప్పడు గ్రామానికి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. అనంతరం పోలీసులు 24 గంటల్లో నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు.