నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

నారా లోకేశ్‌కు తప్పిన ప్రమాదం

December 11, 2019

Drone Camera01

మాజీ మంత్రి నారా లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఓ డ్రోన్ కెమెరా ఆయనకు సమీపంలో కుప్ప కూలింది. ఈ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆపరేటింగ్ లోపం కారణంగా డ్రోన్  కరెంట్ వైర్లకు తగిలి కింద పడిపోయినట్టు అధికారులు తెలిపారు. 

ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ.. లోకేశ్ పార్టీ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఇందులో భాగంగా మంగళగిరి నుంచి అమరావతి వరకు ఆయన పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించారు. టీడీపీ చేపట్టిన ఈ ధర్నాను పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. బస్సులోంచి లోకేశ్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వీడియో రికార్డు చేస్తున్న డ్రోన్ తీగలకు తగిలి కుప్పకూలింది. టీడీపీ నేతలకు అత్యంత సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ పడిపోవడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కొంత సేపు అయోమయం నెలకొంది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని భద్రతా సిబ్బంది తెలిపారు.