టీడీపీ నేత నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ కి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ వీడియోలో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని తన కారులో ఎక్కించేందుకు జగన్ ప్రయత్నిస్తుండగా, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారించిన జగన్.. ఆయన ఎవరో కాదు స్వామీ.. నా తమ్ముడే.. చెప్పా కదా అని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన నారా లోకేష్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘తప్పులు చేసినా, తప్పుడు మనుషుల్ని ప్రోత్సహిస్తున్నా ఈ దుస్థితి తప్పదు గొడ్డలి పోటు రెడ్డి గారూ! బాబాయికి అబ్బాయిగా చేసిన ద్రోహం వెంటాడుతూనే ఉంటుంది. తమ్ముడు తమ్ముడే నేరగాడు నేరగాడే.. అదీ భద్రతా సిబ్బంది లెక్క’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, క్రిస్ మస్ పండుగ సందర్భంగా కడప జిల్లాకు, పులివెందులకు సీఎం జగన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏపీలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఏపీలో మార్మోగుతున్న రంగా పేరు.. మధ్యలో నలిగిపోతున్న రాధా
ఇకపై చంద్రబాబు కేసీఆర్ను ఆడుకుంటారు.. జగ్గారెడ్డి