మహానాడులో లోకేశ్ న్యూ లుక్.. 20 కిలోలు తగ్గాడట - MicTv.in - Telugu News
mictv telugu

మహానాడులో లోకేశ్ న్యూ లుక్.. 20 కిలోలు తగ్గాడట

May 28, 2020

Nara Lokesh Slim Look in Mahanadu

టీడీపీ మహానాడు రెండు రోజుల పాటువిజయవాడ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కొత్త లుక్‌లో కనిపిస్తూ అందరిని ఆకర్షించారు. ఉత్సాహంగా కనిపిస్తూ.. అందరిని సరదాగా పలకరించారు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఆయన ఈసారి చాలా సన్నగా మారిపోయి కనిపించారు. లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలపాటు హైదరాబాద్‌లో ఉన్నఆయన సన్నగా మారిపోయి మహానాడుకు వచ్చారు. ఆయన్ను చాలా రోజులకు చూసి చిన్నబాబు సన్నబాబు అయిపోయారంటూ చర్చించుకున్నారు. ఈ మార్పు వెనక రహస్యం ఏంటా అని పార్టీ నేతలు ఆరా తీయడం ప్రారంభించారు. 

నేతలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఉన్న వాస్తవాన్ని బయటపెట్టారు. తాను గడిచిన ఆరు నెలల్లో 20 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చారు. ‘నైక్ ట్రైనింగ్ క్లబ్’ మొబైల్ యాప్‌లో సూచించిన విధంగా  ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ.. బరువును తగ్గించుకుంటున్నానని తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో ఏడు కిలోలు తగ్గినట్టుగా చెప్పారు. యోగ,డైట్ సరిగా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాని పేర్కొన్నారు. ఇక ప్రతి మహానాడులో పసుపు చొక్కా వేసుకొని ఆయన కనిపించే వారు. దీనిపై నేతలు ఆరా తీయగా.. పసుపు చొక్కాలు అన్ని లూజైపోయాయని, లాక్‌డౌన్‌లో కుట్టే వాళ్లు అందుబాటులో లేకపోవడంతో వేసుకురాలేదని తెలిపారు. కాగా లోకేశ్ శరీరాకృతిపై తరుచూ వైసీపీ నేతలు కామెంట్ చేసేవారు. ఈ క్రమంలో పట్టుదలగా ఆయన తన బరువు తగ్గించుకోవడంతో తెలుగు తమ్ముళ్లలో మరింత జోష్ నింపుతున్నారని, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.