టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర మంత్రి రోజా నియోజకవర్గం నగరికి చేరుకుంది. ఈ సందర్భంగా రోజాపై లోకేష్ వ్యంగ్య బాణాలు సంధించారు. డైమండ్ పాప అంటే ఫీలవుతుంది కాబట్టి ఇక నుంచి జబర్దస్గ్ ఆంటీ అని పిలుస్తానని వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ జగన్ పాలనపై సెటైర్లు వేశారు. మూడేళ్ల 8 నెలల పాలనా కాలంలో సీఎంగా వైఎస్ జగన్ ఏం పీకాడా? అని ఇన్నాళ్లు జుట్టు పీక్కున్నానని, కానీ ఇప్పుడర్ధమైంది ఏం పీకాడో.. నా మైక్ పీకేశాడని ఎద్దేవా చేశారు. ఆయన మాటల్లో కొన్ని ముఖ్యమైనవి.
1. పాదయాత్ర దెబ్బతో జగన్‌కి లండన్ మందులు పని చేయడం లేదు
2. అయ్యా జగన్ రెడ్డీ నువ్వు పది ఫెయిల్. నీకే అంత తెలివి ఉంటే స్టాన్‌ఫోర్డులో చదివిన నాకు ఎంత తెలివి ఉంటుందో ఆలోచించుకో
3. నువ్వు కేవలం నా మైక్ లాక్కున్నావు కానీ స్వర్గీయ ఎన్టీఆర్ ఇచ్చిన నా గొంతును కాదు
4. జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్‌లో రోజుకు 150 టిప్పర్లు తమిళనాడుకు వెళ్తున్నాయి
5. ఆమె ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యిందో గ్రానైట్ కంపెనీలకు, క్వారీ యజమానులకు ఫోన్లు చేసింది. దాంతో వారు పారిపోయారు
6. తన నియోజకవర్గంలోని వడమాల పేట, నిండ్ర, పుత్తూరులని అన్న రాంప్రసాద్ రెడ్డికి, కుమారస్వామికి విజయపురం, నగరిని భర్త సెల్వమణికి రాసిచ్చింది.
7. ఈ లెక్కన నగరికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఆంటీ ఇంట్లో రాత్రి తాము దోచుకున్న సొమ్ము లెక్కలేసుకుంటారు.
8. కొసలనగరంలో 35 ఎకరాలు, వడమాల పేట టోల్‌గేటు వద్ద 55 ఎకరాలు గోవిందా గోవిందా
9. వైజాగ్ రిషికొండ వద్ద ఎకరం గోవిందా
10. ఇక్కడ ఏ అవినీతి జరిగినా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా ఇసుక మాఫియా ఉన్నా దాని కేరాఫ్ పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి.
11. నేను లోకేష్‌ని నక్సలైట్ కాదు. నీ జీవో నెంబర్ 1ని మడచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.
12. జగన్‌కి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. నేను 400 రోజులు పాదయాత్ర చేస్తున్నా. నాపై 400 కేసులు పెట్టుకో. నామైక్ లాక్కో. నీ ఎఫ్ఐఆర్‌లు చూసి లోకేష్ భయపడడు.
అనంతరం టీడీపీ గెలుపుకోసం కష్టపడి పని చేయాలని, భాను అనే కుర్రాడిని గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలను కోరారు.