కేసీఆరే ఓనర్, రాళ్లుమోసినోళ్లంతా ఓనర్లు కారు.. నారదాసు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆరే ఓనర్, రాళ్లుమోసినోళ్లంతా ఓనర్లు కారు.. నారదాసు

September 11, 2019

Naradasu lakshman.

టీఆర్ఎస్‌కు తాము కూడా ఓనర్లమే అంటున్న నాయకులు సంఖ్య పెరుగుతోంది. వారికి కౌంటర్లు ఇచ్చే వారూ పెరుగుతున్నారు. టీఆర్ఎస్‌కు తామూ ఓనర్లమేనంటూ మొన్న మంత్రి ఈటల రాజేందర్, నిన్న మాజీ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కలకలం రేపారు. ఈ వ్యవహారంలోకి ఎమ్మెల్సీ  నారదాసు లక్ష్మణ్ కూడా దూసుకొచ్చారు. టీఆర్ఎస్‌కు కేసీఆర్ మాత్రమే ఓనర్ అని ఆయన తేల్చిచెప్పారు.

‘తాజ్ మహల్‌కు రాళ్లుమోసిన వాళ్లంతా ఓనర్లు కారు. టీఆర్ఎస్‌కు నేను కూడా ఓనర్ అని ఎవరైనా అంటే అది అవివేకం. మార్క్సిజానికి మార్క్స్ ఒక్కరే ఓనర్, లెనినిజానికి లెనిన్ మాత్రమే ఓనర్. ఆ విధంగా  టీఆర్‌ఎస్‌కు కూడా కేసీఆరే ఒక్కరే ఓనర్..’ అని నారదాసు అన్నారు.