‘నారప్ప’ కొడుకు నిశ్చితార్ధం - MicTv.in - Telugu News
mictv telugu

‘నారప్ప’ కొడుకు నిశ్చితార్ధం

March 5, 2022

23

నారప్ప చిత్రంలో హీరో వెంకటేష్ పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో నటించిన కార్తీక రత్నం నిశ్చితార్థం శనివారం జరిగింది. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు పాల్గొన్నారు. అమ్మాయి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంగేజ్‌‌మెంట్‌కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, మునికన్నా పాత్రతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కార్తీక రత్నం, ఇటీవల ‘అర్ధ శతాబ్దం’ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు.