నారాయణ అక్రమాల ఆడియో.. - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ అక్రమాల ఆడియో..

November 2, 2017


నారాయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ఒకటొకటే బయటడుతున్నాయి. వీటిని వివరంగా తెలిసే ఆడియో ఒకటి వైర్ అయింది. నోట్ల రద్దు తప్పించుకునే మార్గాలు, అక్రమ సంబంధాలు వంటి ఎన్నో విషయాలు ఇందులో వెలుగు చూశాయి. హైదరాబాద్‌ రామాంతపూర్‌లోని నారాయణ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ నవీన్‌.. ప్రిన్సిపాల్‌ సరితా అగర్వాల్‌తో మాట్లాడిన మాటలు ఇందులో ఉన్నాయి. సంస్థలో పనిచేసే ఒక కీలక వ్యక్తికి వివాహేతర సంబంధముందని వీరు మాట్లాడుకున్నారు.  వనస్థలిపురంలోని నారాయణ విద్యాసంస్థల గెస్ట్‌హౌసులో ఘోరాలు జరుగుతున్నాయని సంభాషించుకున్నారు. హయత్‌నగర్‌ నారాయణ బ్రాంచ్‌ ఉద్యోగి శ్రీలత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కూడా చెప్పుకున్నారు. అతడు ఉప్పల్ ఫోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. మరోపక్క.. ఈ ఆడియోల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు నారాయణ గూడలోని కాలేజీపై దాడి చేశాయి.