విద్యార్థుల వీర ఆవేశానికో లెక్కుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థుల వీర ఆవేశానికో లెక్కుంది..!

June 28, 2017

నారాయణ..నారాయణ…విద్యార్థులు వీరంగమేశారు.కుర్చీలు విరగొట్టారు. అద్దాలు, లైట్లు పగులగొట్టారు.పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అవును ఇందులో తప్పు ఎవరిది అంటే విద్యార్థులదే. ముమ్మాటికీ వాళ్లదే. దానికి వారిని మందలించాల్సిందే.కానీ వాళ్లు అలా రెచ్చిపోవడానికి కారకులు ఎవరు..? తొక్కలో కార్పొరేట్ రూల్సే వారితో అలా చేయించలేదా..?అస్తమానం చదువులంటే ఎలా..? రిలాక్సేషన్ మాటేంటి..?

కార్పొరేట్ కాలేజీలు చదువుల జైళ్లు. నేరస్తులు నేరం చేసి జైలుకెళితే.. పిల్లల మాంచి భవిష్యత్ కోసం పేరెంట్స్ చదువుల జైలుకు పంపిస్తారు. సర్వసతీ నిలయాలకు వాటికి లింక్ పెట్టడం భావ్యం కాదు. కానీ నారాయణతో పాటు అన్ని కార్పొరేట్ కాలేజీలు బందీఖానాలుగానే వ్యవహారిస్తున్నాయి. లక్షలు లక్షలు ఫీజులు వసూలు చేసి మహారాజులా చూడాలి. అలా జరగడం లేదు. అందుకే జైళ్లతో పోల్చాల్సి వస్తుంది. ఒక్కసారి కాలేజీ క్యాంపస్ లోకి ఎంటరైతే మళ్లీ బయటకు రావడం కష్టం…వారం ,రెండువారాలు..ఒక్కోసారి నెల అయినా అందులోనే. పేరెంట్స్ వస్తే కలవడానికి నానా రూల్స్ తో వారానికో ఓ గంట పర్మిషన్ ఇస్తారు. మరి వారానికి పిల్లలకు ఓ గంట సరిపోతుందా..? పొద్దున్న లేచి దగ్గర్నుంచి అర్దరాత్రి దాకా చదువు,,,చదువు.. పుస్తకాలతోనే కుస్తీ. బుర్రలు వేడెక్కిపోతాయి.