నారాయణ...మత్స్యావతారం... - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణ…మత్స్యావతారం…

September 3, 2017

వింతు పలు రకాలు.  ఇది మాత్రం వింతల్లోకెల్ల  వింత. నారాయణ అంటే మనకు ఎవరు  గుర్తుకొస్తారు… మీకు తోచిన వాల్లు… మీకు  గుర్తు వారు గుర్తుకొస్తారు. అయితే మహారాష్ట్రలోని ఓ గ్రామంలో నారాయణ అంటే చేపనే గుర్తుకొస్తున్నదట.  అదేంటీ చేప గుర్తుకు రావడం ఏమిటని అనుకుంటున్నారా… అయితే ఈ స్టోరీ చదవాల్సిందే….

మహారాష్ట్ర సాంగ్లి జిల్లా యోదెమశ్చీంద్ర అనే గ్రామంలో  ప్రకాశ్ పాటిల్ అనే రైతున్నాడు.ఈయనకు ఓ వ్యక్తి రెండు నెలల కింద ఓ చేపను ఇచ్చాడు. దీన్ని వండుకునే తింటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పాడు. కానీ రైతు మాత్ర దాన్ని తన పొలంలోని బావిలో వదిలేశాడు.  దానికి నారాయణ అని పేరు పెట్టాడు. ఓ సారి నీళ్లు తోడినప్పుడు బకెట్ లోకి వచ్చింది. తిరిగి దాన్ని నీళ్లలోకి  వదిలేశాడు.  నారాయణ అని పిలవగానే అది నీళ్లలో నుండి బయటకు వస్తుందట. దాన్ని చేతిలోకి తీసుకుని చూసి సంతోషంతో నీళ్లలోకి వదిలేస్తున్నాడట. ఇట్లా ఇద్దరి మధ్య  మంచి స్నేహం కుదిరింది. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాల్లో తెలియడంతో జనం పెద్ద సంఖ్యలో బావి వద్దుకు వచ్చి నారాయణ అని  పిలుస్తున్నారట.  బలే ఉంది కదా చేప రైతు బంధం. దీని పైనే  జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున స్టోరీ కూడా వస్తున్నాయట.