Home > Featured > ఎవరు సీఎం అయినా అభిమానిస్తాం : ఆర్. నారాయణమూర్తి

ఎవరు సీఎం అయినా అభిమానిస్తాం : ఆర్. నారాయణమూర్తి

Narayana Murthy Comments On Ap Cm..

సీఎంగా ఎవరు ఉన్నా తాము అభిమానిస్తామన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ సీఎంగా జగన్ ఎన్నికవడం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదా అనే చర్చ రావడంతో ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన ఎవరు సీఎంగా ఉన్నా అభిమానిస్తామని సమాధానమిచ్చారు.

చిత్ర పరిశ్రమ అద్దాలమేడలాంటిది.. ఎలా అర్థం చేసుకుంటున్నామనే దాని తీరుపై ఆధారపడి ఉంటుందన్నారు. సినీ పరిశ్రమకు రాజకీయాలతో సంబంధం ఉండదని చెప్పారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా,ముఖ్యమంత్రి ఎవరైనా వారిని అభిమానిస్తామని తెలిపారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలా తరలింపు వల్ల ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

Updated : 16 Aug 2019 11:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top