సీపీఐ నారాయణ గవర్నర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్లుగా మారారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారికి వందల కోట్ల రూపాయలు అనవసర ఖర్చు తప్ప వారి వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో బహిష్కరించిందనీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ముఖ్యమంత్రికి హెడ్ క్లర్క్‌గా మారారని విమర్శించారు. కేంద్రానికి అనుకూలంగా ఉండేవారితో ఒకలా, వ్యతిరేకంగా ఉండేవారితో మరొకలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు పశ్చిమ బెంగాల్, కేరళలను నారాయణ ఉదాహరణగా చూపారు. ఇదిలా ఉండగా, ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగిస్తుండగా, టీడీపీ సభ్యులు అడ్డకోవాలని చూడడం, గవర్నర్‌పై విమర్శలు చేయడం వివాదాలకు దారి తీసింది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీఎల్పీ నేత అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాము గవర్నర్‌ను అవమానించినట్టు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. వయసులో పెద్ద అయిన గవర్నర్‌ను అవమానించడం తగదని హితవు
పలికారు.