Narayana sites on Nagarjuna's comments..okay for them, for the rest
mictv telugu

నాగార్జున వ్యాఖ్య‌ల‌పై నారాయ‌ణ సైట‌ర్లు..వాళ్ల‌కి స‌రే, మిగిలిన వాళ్ల‌కి

September 13, 2022


టాలీవుడ్‌లో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రారంభ‌మైన సీపీఐ నారాయ‌ణ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఎప్పుడు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అక్కినేని నాగార్జున మాత్రం స్పందించ‌లేదు. తాజాగా బిగ్ బాస్ షో 6వ సీజ‌న్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌త శ‌నివారం ఓ ప్రోమో విడుద‌లైంది.

ఆ ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ..హౌస్‌లో ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్‌లను హగ్ చేసుకోమని అన్నారు. అంతేకాదు, తనను విమర్శించిన నారాయణను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ”నారాయణ, నారాయణ, వాళ్లు పెళ్లయినవాళ్లు” అని అన్నారు. దాంతో నాగార్జున వ్యాఖ్య‌లను నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.

ఈ క్రమంలో నాగార్జున‌ వ్యాఖ్యలపై కాసేప‌టిక్రిత‌మే సీపీఐ నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ”నాగన్నా, నాగన్నా, బిగ్ బాస్ షోలో పెళ్లయిన వాళ్లకి శోభనం గదిని ఏర్పాటు చేశారన్నా. మిగిలిన వాళ్లు ఏమైనారు అన్నా?” అని సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజ‌న్స్ నాగార్జున ఫోటోల‌ను యాడ్ చేసి తెగ ట్రోల్ చేస్తున్నారు. మళ్లీ నారాయణ వ్యాఖ్యలపై నాగార్జున‌ ఎలా స్పందిస్తారోన‌ని నెటిజ‌న్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.