ఓవైపు సింపులిజం..మరోవైపు పవనిజం,మరి వారిద్దరూ కలిస్తే మాటలెలా ఉంటాయో జస్ట్ ఊహించుకోండి.ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డిగారి కూతురి పెండ్లిలో ఆర్ నారాయణమూర్తిగారు,పవన్ కళ్యాన్ గారు ఇలా తారసపడ్డారు,చేతిలో చెయ్యివేసి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు.చిటికేస్తే లగ్జరీలో బ్రతికే అవకాశమున్నా..అవేమి కాదనుకొని కొన్నివిలువలకు కట్టుబడి సింపుల్ గా బ్రతికేవారు ఒకరైతే,యూత్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్న వారు మరొకరు.తన సినిమాలలో ఎర్రజెండా ఎగరేసి ఇటు ప్రజలలో అటు సమాజంలో చైతన్యం తీసుకురావాలనే నైజం కరిదైతే,జనసేన అనే ఎజెండాతో ప్రజల్లోకి వచ్చిన పవనిజం మరొకరిది.ఏది ఏమైనా వీళ్లిద్దరిని ఇలా ఒకే దగ్గర చూస్తే అభిమానుల్లో ఏదో కొత్త అనుభూతి కలగడం మాత్రం ఖాయం.