ప్లస్, మైనస్ అంతా ఆయనే... - MicTv.in - Telugu News
mictv telugu

ప్లస్, మైనస్ అంతా ఆయనే…

September 12, 2017

ఎన్డీఎలో బిజెపి బిజెపి ప్రధాన పక్షమనేది ఒకప్పటి మాట. ఇప్పుడు బిజెపిలో ఎన్డీఏ ఉందనేది కన్పిస్తున్న పిచ్చర్. ఇంకా చెప్పాలంటే  మోడీ నే ఆల్ రౌండర్. ఇదే ఇప్పుడు ఎన్డీఏ ఎనికిని ప్రమాదంలో పడేశాయనే  పెద్ద డిబేట్ అవుతున్నది. యూపిఎను బ్రేక్ చేయడానికి… కాంగ్రెసేతర పక్షాలను,  బిజెపి అనుకూల పార్టీలను తమ వైపుకు తిప్పుకోవడంలో అప్పటి  అధినేతలు  లాల్ కృష్ణ అద్వానీ, వాజ్ పేయి సెక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అంతా మోడీ మయం అయింది.

ఎన్డీఎలోని పార్టీలు కూడా   ఎగ్జిట్  అయ్యే ఛాన్స్ కోసం ఎదురు  చూస్తున్నాయట. ఎన్డీఎలో ఉండి ఉనికి కోల్పోవడం కంటే బయటకు వెళ్లడమేబెటర్ అనుకుంటున్నారట. ఇందులో  ఫస్ట్ ప్లేస్ లో శిశసేన ఉంది.  మొన్నటి బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య  అస్సలు పొత్తుకుదర లేదు. చివరకు ఫడ్నవీస్ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది.

వచ్చే ఎన్నికల్లో మిషన్ 350 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. గతంలో సాధించిన సీట్ల కంటే అధికంగ సాధించి   పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మోడీ భావిస్తున్నారు. అందుకే  వీలున్నా లేకున్నా అమిత్ షాను అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారు. మరో వైపు మిత్ర పక్షాలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

మొన్నటి మంత్రి వర్గ పునర్వీస్థీకరణలో మిత్ర పక్షాలకు అస్సలు ఛాన్స్  ఇవ్వ లేదు. దీంతో తన మాటనే నెగ్గించుకునే ధోరణి మోడీలో  కన్పించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీస్ ఓ మెట్టు దిగి.. బెట్టు  వీడి మోడీకి జై కొట్టినా కూడా మంత్రి వర్గంలో చోటు లేకుండా చేశాడు మోడీ. ఇవన్నీ కూడా ఈ పార్టీ మోడీతో ఉంటుందా  లేదా అనే  చర్చను తెరపైకి తెచ్చింది. ఈయనే కాదు రాష్ట్రాల్లోని చిన్నా, చితక పార్టీలు కూడా మోడీకి జై కొట్టాలని అనుకున్నా అదను కోసం వేచి చూస్తున్నాయి దూరం కావడానికి.

గతంలో ఎపి  నేత చంద్రబాబు నాయుడు 24 మందికిపైగా ఎంపిలనుచేతిలో పెట్టుకుని వాజ్ పేయి హయాంలో  హిస్తినలో చక్రం తిప్పారు. ఇప్పుడు  ఎంపిలున్నా ఆయన అక్కడ చేసేదీ లేదు. మోడీ చెప్పినట్లు వినడం తప్ప మరో మార్గం లేదు. ఎన్డీలోని  పార్టీలు ఉత్తరాదికి చెందిన వారు  ఎన్డీలో ఉన్నా తమకు ఉనికే లేదనే  భావనతో ఉన్నారట. వచ్చే ఎన్నికల నాటికి మోడీ వైఖరిలో మార్పు రాకుంటా అంతా శివసేన బాటలోవెళ్లేందుకు సిద్దం అవుతున్నారట.

ఇక బిజెపి పాలిత రాష్ట్రాల్లో వచ్చేఎన్నికల  నాటికి ఖచ్చితంగా ఫలితాలు   డిఫరెంట్ గా ఉంటాయని అంటున్నారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బిజెపి పోయిన సాధారణ ఎన్నికల్లో క్లీన్ స్వీప్  చేసింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సీన్ ఛేంజ్ కావడం ఖాయమని అంటున్నారు. యూపిలో 80 స్థానాలకు గాను 73  స్థానాలు, బిహార్ లో 40 కి గాను 31,  మహారాష్ట్రలో 48కి గాను 42, మధ్యప్రదేశ్ లో 29 కి గాను 27,  చత్తీస్ ఘడ్ లో 11 స్థానాలకు 10 స్థానాలు ఎన్డీయే గెల్చుకున్నది. వచ్చే ఎన్నికల్లో ఇంత స్థాయిలో సీట్లు  రావడం కాస్త కష్టమనే  అనుకుంటున్నారట. కారణం మోడీ వైఖరనే అంటున్నారు.

కొత్తగా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అకౌంట్లు ఓపెన్ చేయాలని బిజెపి భావిస్తున్నది. మిత్ర పక్షాల కంటే ఓ అడుగు ముందుకేసి తానే బలపడాలని అనుకుంటున్నది. ఎపి, తెలంగాణ, ఒడిసా,  కేరళ, బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్నది. ఒక వేళ అక్కడ పార్టీ  బలపడాలని  ఉన్నా… మోడీ మయం కావడంతో  సొంత పార్టీ నాయకులే జంకుతున్నారు.

బిజెపి మోడీనే బలం అయ్యారు. ఇప్పుడు ఆయనే బలహీనం అవుతున్నారు సంఘ్ ఎజెండాను  బాగా అమలు చేస్తున్నారనే పేరు తెచ్చుకున్నా కూడా పార్టీని, నాయకత్వాన్ని బలహీన పరుస్తున్నారనే విమర్శనూ మూటగట్టుకుంటున్నారు. ముందు ముందు  నరేంద్ర భాయ్ మోడీ  పద్దతి మారకుంటే పార్టీకి వచ్చే ప్రయోజనం కంటే జరిగే నష్టమేఎక్కువనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.