మోడీ ఒక్కో సారి మిలినీయం జోకులు పేలుస్తుంటారు - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ ఒక్కో సారి మిలినీయం జోకులు పేలుస్తుంటారు

September 13, 2017

మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్కో సారి మిలినీయం జోకులు పేలుస్తుంటారు. అట్లాంటిదే తమ ప్రభుత్వం అమలు చేసిన చేస్తున్న పథకాల  గురించి పిల్లలకు పాఠాలు చెప్పడం  అనే నిర్ణయం. కేంద్ర  ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీంలు, స్వచ్చ్ భారత్, పెద్ద నోట్ల రద్దు వంటి విషయాలపై   కొత్త సిలబస్ తయారు చేసి  విద్యార్థులకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆలోచన మంచిదే కాని స్వచ్చ్ భారత్ గురించి  పిల్లలకు పాఠాల రూపంలో చెప్పడం అంటే….. రోజూ   రోడ్లపై   చెత్తా చెదారం చూస్తూనే ఉన్నారు  పిల్లలు.   మురికి ఎక్కడిది అక్కడే ఉంటుంది.  పుస్తకంలో మాత్రం ఎంతో గొప్పగా చెప్తుంటారు.  ఇవన్నీ పిల్లల్లో ఎలాంటి అభిప్రాయం కల్పిస్తాయి. అంటే పుస్తకం వేరు… జీవితం వేరు అనే అభిప్రాయానికి రావడం ఖాయం. అయితే నిజంగానే  స్వచ్ఛ్ భారత్ ఆలోచన మంచిదే కానీ… ఆచరణ అంతా ఉత్తదే. అలాంటి దాని గురించి  భవిష్యత్తు తరాలకు పాఠం  రూపంలో చెప్పే సహాసమే అస్సలు బాగా లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇక  పెద్ద నోట్ల  రద్దు  అంశం  గురించి ఎంత  తక్కువ మాట్లాడితే అంత మంచిది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇండియా అంతా ఇండ్లల్ల కాదు… రోడ్ల మీదనే ఉన్నది. దాని వల్ల లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని ప్రపంచ ఆర్థిక వేత్తలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నదున్నట్లు పిల్లలకు చెప్తే సంతోషించాల్సిందే. కానీ దీనికి భిన్నంగా చెప్తే  ఇబ్బందే కదా. అందుకే ముందు పాలకులు పాఠాలు నేర్చుకుంటే మంచిది.