Home > Featured > జైట్లీ తర్వాతి నంబర్ మోదీనే.. బ్రిటన్ ఎంపీ కారుకూతలు

జైట్లీ తర్వాతి నంబర్ మోదీనే.. బ్రిటన్ ఎంపీ కారుకూతలు

ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ మూలాలకు చెందిన బ్రిటీష్ ఎంపీ నజీర్ అహ్మద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అరుణ్ జైట్లీ పరమపదించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ దుమారం లేపింది. అరుణ్ జైట్లీ తర్వాత ప్రధాని మోదీ నెంబరేనంటూ ఆయన ట్వీట్ చేశారు. వెంటనే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు… నజీర్ అహ్మద్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటికే నజీర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా నజీర్ పై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు.

బీజేపీ పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ ఏదో జాదూ చేస్తోంది.

చేతబడులు చేస్తోంది. వశీకరణ విద్యను ప్రదర్శిస్తోంది. అందుకే జైట్లీ, సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్ పేయి, మనోహర్ పారికర్ లాంటి బడా బీజేపీ నేతలంతా ఒక సంవత్సరం వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. తరువాతి నెంబర్ నరేంద్ర మోదీదే.. అంటూ ఆయన ట్వీట్ చేశారు.

నజీర్ ట్వీట్ పై వెంటనే రెస్పాండ్ అయిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు… హౌస్ ఆప్ లార్ట్స్ లోకి అటువంటి వ్యక్తి ఎలా ప్రవేశించాడో అర్థం కావడం లేదు. మేనేజ్ చేసి
అయితే… నజిర్ అహ్మద్ కు ఇలాంటి వివాదస్పద ట్వీట్లు చేయడం ఇదే కొత్తేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కూడా పిచ్చి పిచ్చి ట్వీట్లు చేశారు. ఆయనకు వివాదస్పద ట్వీట్లు చేసి వార్తల్లో నిలవడం అంటే ఇష్టం కావచ్చు.. అందుకే… ఇలాంటి పనికిమాలిన ట్వీట్లు చేస్తుంటారు.

అయితే… నజీర్ గతంలోకి ఒకసారి వెళ్తే… 1970లో ఓ అత్యాచారయత్నం కేసులో నజీర్ దోషిగా నిలిచారు. ఇద్దరు మైనర్లపై నజీర్ అత్యాచారయత్నం చేసినట్లు రుజువైంది. అత్యాచారం చేసిన వ్యక్తి మైండ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థం అవుతోంది. ఇలాంటి వ్యక్తులను బ్రిటన్ పార్లమెంట్ లో ఎలా ఎన్నుకున్నారో అర్థం కావడం లేదు. ఇంత చీప్ గా ఎలా మాట్లాడుతారు.. ఇటువంటి వ్యక్తులు అంటూ నెటిజన్లు కూడా కాస్త ఘాటుగానే నజీర్ తలంటారు.

ఎంపీగా గెలిచావా? అంటూ కాస్త ఘాటుగానే కిరణ్ ట్వీట్ చేశారు.

Updated : 27 Aug 2019 10:59 AM GMT
Next Story
Share it
Top