జబర్దస్త్ మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

జబర్దస్త్ మోదీ

June 17, 2017

మన పియం నరేంద్ర మోడీ సారుకు ఫుల్లు పబ్లిసిటీ వుంది. సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకున్నాడు కాబట్టి తనకు తానే సాటిగా చాలా ఫాలోయింగును సంపాదించుకున్నాడు. ఈ వీడియో సాంగ్ చూస్తే మీక్కూడా అర్థమైపోతుంది మోడీకి ఎంత పాపులారిటీ వుందో.. ఆయన తీస్కొచ్చిన పథకాల గురించి, నోట్ల రద్దు గురించి, ఆయన రైతులకు, మహిళలకు చేస్తున్న ఉద్దార్కం గురించి ‘ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ’ వాళ్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ తారీఫుల పాట పాడి మోడీకి జైకొట్టారు. పెద్దమన్షి మస్తు పాడుతుంటే పక్కకున్న ఆడోల్లు, మొగోళ్లంతా కోరస్ అదించి చాలా జోష్ గా పాడారు. దానికి త్రీడీల మోడీ బొమ్మతోని మస్తు డాన్సులు చేయించారు.. వాళ్ళు పాడుతూ తందానా అంటే మోడీ ఏమో తందానా అని డాన్స్ చేసినట్టే వుంది. మోడీయా మజాకా.. పబ్లిసిటీల మోడీని మించిన మగాడు లేడేమో ఈ ప్రపంచంలో ? జబర్దస్త్ మోదీయా మజాకా ??