మోడీ దోస్తానా పనిచెయ్యలేకపోయింది.. ఉద్ధవ్ ఠాక్రే ! - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ దోస్తానా పనిచెయ్యలేకపోయింది.. ఉద్ధవ్ ఠాక్రే !

July 24, 2017

నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయినప్పట్నుంచి ఇతర దేశాలతో ఫ్రెండ్ షిప్ చేస్తూ ప్రపంచ దేశాలతో మైత్రిని కొనసాగిస్తున్నాడు. కానీ చైనా, పాకిస్తాన్ లతో భారత్ తమ సమస్యలపై అంతర్ఝాతీయ మద్దత్తు పొందటంలో మాత్రం మోడీ దోస్తానా మంత్రం పనిచేయలేకపోయిందని ? శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వాఖ్యానించారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి వర్సగా టూర్లు పెట్టుకొని మ్యాగ్జిమమ్ అన్నీ దేశాలు కవరయ్యేలా ఫ్రెండ్ షిప్ కు ప్లాన్ చేసాడు. కానీ చైనా, పాకిస్తాన్ ల విషయంలో బోల్తా కొట్టాడనే చెప్పొచ్చు. రెండు దేశాలతో సరిహద్దు సమస్యను ఎదుర్కుంటున్న భారత్ మోడీ చలవ వల్లనైనా తీరుతుందనుకున్నారు కానీ అది మోడీ వల్ల అవలేకపోయిందని అభిప్రాయ పడ్డాడు ఉద్ధవ్ ఠాక్రే.