ప్రియమైన ప్రణబ్ గారికి...! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియమైన ప్రణబ్ గారికి…!

August 3, 2017

ప్రియమైన ప్రణబ్ గారికి ఇన్నిరోజులు మీరు నాకు తండ్రిలాగా ,గురువులాగా వ్యవహరించారు,అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖ ఎంతో భావోద్వేగంతో కూడుకొని ఉన్నది.రాష్ట్రపతిగా ప్రణబ్ దిగిపోయే చివరి రోజు మోడీ లేఖ ద్వారా ఓ సందేశాన్ని పంపారు.నేను దేశ రాజధానికి ఓ బయిటి వ్యక్తిలాగా అడుగుపెట్టాను.అప్పుడు మీ నాణ్యమైన జ్ఝానం,మార్గదర్శకత్వము నాకు ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాయి.అంటూ లేఖలో పేర్కొన్నారు మోడీ.

ఈలేఖ రెండు భిన్నమైన రాజకీయాలు,సిధ్ధాంతాలు కలిగిన వ్యక్తుల మద్య సంబంధం అంటూ మాజీ రాష్ట్రపతి ఈలేఖను విడుదల చేశారు.

రాష్ట్రపతిగా నా చివరి రోజు నాడు  ప్రధానమంత్రి నుండి అందుకున్న లేఖ నా హృదయాన్ని అతలా కుతలం చేసింది’’ అంటూ ఆ లేఖను

ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్లో విడుదల చేశారు.