మోదీపై మరో బయోపిక్.. ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సాహో
View this post on InstagramA post shared by Prabhas (@actorprabhas) on
ప్రధాని మోదీ జీవితం ఆధారంగా మరో సినిమా రూపొందుతోంది. ఎన్నికలకు ముందు మోదీ జీవిత ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' పేరుతో ఓ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు విజేత ఒమంగ్ కుమార్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలో మోదీ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటించారు.
తాజాగా మోదీ జీవితం ఆధారంగా మరో సినిమాను రూపొందిస్తున్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ. ‘మన్ బైరాగీ’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రధాని మోదీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను ‘మన్ బైరాగీ’ సినిమాలో చూపించనున్నారు. ఈరోజు మోదీ పుట్టినరోజుని పురస్కరించుకొని చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సంజయ్ లీలా భన్సాలీ, మహావీర్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో 'మనోవిరాగి' పేరుతో విడుదల కానుంది.