మీటింగ్‌కు బాలయ్యను ఎలా పిలుస్తాం?: నరేష్ - MicTv.in - Telugu News
mictv telugu

మీటింగ్‌కు బాలయ్యను ఎలా పిలుస్తాం?: నరేష్

May 29, 2020

 

Naresh

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై సినిమా రంగంలో వివాదం రేగుతోంది. ‘తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న సమావేశాలకు తనను పిలవడం లేదని.. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు’ అని బాలయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే పరిశ్రమ పెద్దలంతా కలిసి మరో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని, ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నరేష్ అన్నారు. ‘మీటింగ్స్‌కు అందరినీ పిలవాలని నిబంధన లేదు, బాలకృష్ణతో పాటు చాలా మంది హీరోలను పిలవలేదు. బాలకృష్ణ అవసరం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తాం. అయినా బాలకృష్ణను పిలవాల్సింది మా అసౌసియేషన్’ అని నరేష్ అన్నారు. 

సి కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయని అన్నారు. మీటింగ్‌కు మిమ్మల్నే పిలవలేదు, ఇక మేము బాలకృష్ణ‌ను ఎలా పిలుస్తాం? అని ప్రశ్నించారు. ‘మిమల్ని పిలవని మీటింగ్‌కి మేము వేరేవాళ్లను ఎలా పిలుస్తాం. సి కల్యాణ్ బాలకృష్ణను మా ఆహ్వానించాలి అనడం సరికాదు’ అని నరేష్ అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.