Naresh, Pavitra Lokesh Entry In Ramarao on Duty, Craze In Theaters
mictv telugu

రవితేజ కంటే నరేష్, పవిత్రల ఎంట్రీకే థియేటర్లో విజిల్స్

July 29, 2022

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో హీరో ఎంట్రీకి బదులు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కనిపించగానే ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారట. ఆ ఆర్టిస్ట్స్ ఎవరో కాదు పవిత్ర లోకేష్, నరేష్. ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ నటించడం జరిగింది. వీరిద్దరూ అన్నాచెల్లెళ్ల పాత్రల్లో నటించారు. ఈ జంట కనిపించింది కొద్దిసేపే అయినా పవిత్రా.. నరేష్ అంటూ థియేటర్లో కేకలు వేశారట అభిమానులు.

నరేష్, పవిత్రా లోకేష్ లు గత కొన్నేళ్లుగా కలిసే ఉంటున్నారని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నారని ఇటీవల పుకార్లు షికారు చేశాయి. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలను నరేష్ మూడో భార్య రమ్య మీడియా ముందుకు రావడంతో వీరి మధ్య ఎఫైర్ ఉన్న విషయం బయటపడింది. అయితే నరేష్ తనకు మంచి స్నేహితుడని, తనకు తోడుగా ఉంటానని పవిత్రా చెప్పుకొచ్చింది.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవిత్రాకు ఇక అవకాశాలు రావనుకున్నారు. కానీ ఈ రోజు థియేటర్ లో జరిగిన సందడి చూస్తే అదంతా పుకారు అన్నట్లు అర్ధమవుతోంది. ముందు ముందు నిర్మాతలు, డైరెక్టర్ లు కూడా ఆమెకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అవకాశాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదిఏమైనా నరేష్ తో ఎఫైర్.. పవిత్రాకు బాగానే కలిసివచ్చిందని పలువురు అబిప్రాయపడుతున్నారు.