Home > Featured > హెల్మెట్ లేదని లోకేష్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హెల్మెట్ లేదని లోకేష్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

nara lokesh bike rally.

టీడీపీ పార్టీ యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు నర్సీపట్నం పోలీసులు షాకిచ్చారు. టీడీపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు నేపథ్యంలో నారా లోకేశ్ ఈరోజు విశాఖపట్నానికి చేరుకున్నారు.

జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ద్విచక్ర వాహనంపై ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా నారా లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా, టీడీపీ కార్యకర్తలు బైక్‌లు నడిపించుకుంటూ ఆయన వెంట నడిచారు.

Updated : 4 Sep 2019 1:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top