అంతరిక్షం నుంచి ఓటేసిన నాసా వ్యోమగామి - MicTv.in - Telugu News
mictv telugu

అంతరిక్షం నుంచి ఓటేసిన నాసా వ్యోమగామి

October 26, 2020

ISS

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ సందడి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్‌ నవంబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ మహిళా వ్యోమగామి కేట్ రూబిన్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌ జరిగే రోజున తాను స్పేస్‌‌లో ఉంటానని అందుకే ఓటు వేసినట్లు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోను నాసా ట్వీట్ చేసింది. 

ఈ నెల 14వ తేదీన అంతరిక్షంలోకి ప్రవేశించిన రూబిన్స్‌ ఆరు నెలల పాటు అక్కడే ఉంటారు. 1997 నుంచి నాసా అంతరిక్షం నుంచి ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇప్పటివరకు ఎందరో వ్యోమగాములు అంతరిక్షం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వ్యోమగాములు ఫెడరల్‌ పోస్ట్ కార్డు ఆప్లికేషన్‌ ద్వారా అంతరిక్షం నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1997లో మొదటిసారి డేవిడ్ వోల్ఫ్ అనే వ్యోమగామి ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు.