చంద్రుడిపై టాయిలెట్ కడుతున్న నాసా..సలహాలు కావాలట - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రుడిపై టాయిలెట్ కడుతున్న నాసా..సలహాలు కావాలట

June 26, 2020

NASA

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అంతరిక్షంలో బాత్రూం కట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ల్యూనార్ ఉపరితలంపైకి వెళ్లే వ్యోమగాముల కోసం ఈ బాత్రూంను నిర్మిస్తున్నట్టు తెలిపింది. చంద్రుడిపైకి 2024కల్లా తొలి మహిళ, తొలి పురుషుడ్ని పంపాలని నాసా సన్నాహాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే సోలార్ సిస్టమ్ లో బెస్ట్ మూన్ టాయిలెట్ కోసం ప్లాన్లు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా ఇంజినీర్లకు ఆఫర్ చేస్తుంది. ల్యూనార్ రెస్ట్ రూం కోసం ఎవరు బెటర్ ఐడియా ఇవ్వగలరోనని ఎదురుచూస్తుంది. దీనికి బెటర్ ప్లాన్ ఇస్తే 35వేల డాలర్ల ప్రైజ్ లు ఉంటాయని చెప్తుంది. ఈ నేపథ్యంలో నాసా..హీరాక్స్ తో కలిపి ల్యానార్ లూ ఛాలెంజ్ కాంపిటేషన్ నిర్వహిస్తోంది. భవిష్యత్ లో ల్యూనార్ తలానికి చేరుకుంటే అక్కడ టాయిలెట్ ఎలా వాడాలనే దానిపై పరిశోధనలు జరుపుతున్నారు. బాత్రూమ్ టెక్నాలజీ అనేది భూమిపై కంటే అడ్వాన్స్ డ్ గా ఉండాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు.