విక్రమ్ జాడ దొరికింది.. ఇవిగో ఫొటోలు - MicTv.in - Telugu News
mictv telugu

విక్రమ్ జాడ దొరికింది.. ఇవిగో ఫొటోలు

December 3, 2019

Vikram Lander01

భారతశాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రుడి ఉపరితలంపైకి పంపిన విక్రమ్ ల్యాండ్ జాడ దొరికింది. అమెరికా పరిశోధన సంస్థ నాసా దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది.  లూనార్ రికయినసెన్స్ ఆర్బిటార్‌ తీసిన ఫొటోల్లో విక్రమ్ శిథిలాలు ఉన్నాయని పేర్కొంది. యవ్య ప్రాంతానికి 750 మీటర్ల సమీపంలో విక్రమ్ శిథిలాలు కనిపించినట్టు వెల్లడించారు. విక్రమ్ కూలిన ప్రాంతంలో మూడు పెద్ద పెద్ద శిథిలాలను గుర్తించారు.

చంద్రుడి దక్షిణ ద్రువానికి 600 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. కానీ అలా జరగకుండా సాంకేతిక సమస్యలతో గతి తప్పి వేరే ప్రాంతంలో పడిపోయింది. అప్పటి నుంచి దీని కోసం నాసా వెతుకులాట ప్రారంభించింది. మొదటిసారి సెప్టెంబర్ 17ఫొటోలు తీసినప్పటికీ విక్రమ్ జాడ కనిపించలేదు. తాజా తీసిన చిత్రాల్లో దాని ఆనవాళ్లు కనిపించడంతో విక్రమ్ జాడ దొరికిందని నాసా ప్రకటించింది. జులై నెలలో చంద్రయాన్‌2 ద్వారా విక్రమ్ ల్యాండర్‌ను ప్రయోగించారు. కానీ చంద్రుడి ఉపరితలంపై సెప్టెంబర్ 7న ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి కుప్పకూలింది. దీంతో ముక్కలైన విక్రమ్ ఫొటోలను విడుదల చేశారు.