అంగారక గ్రహం మీద ఏలియన్స్ ఉన్నట్టు భ్రమించేలా ఉన్న నాసా విడుదల చేసిన ఫోటో మిస్టరీ వీడింది. ఎవరో చెక్కినట్టు ఉన్న ఆ నిర్మాణ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగిన నిపుణులు చివరికి అదొక రాయి భాగమని తేల్చేశారు. మన కంటే అంగారకుడిపై ఎక్కువ భూకంపాలు వస్తాయి. ఈ క్రమంలో మే 4వ తేదీన కూడా భారీ భూకంపం వచ్చినట్టు నాసా కనుగొంది. ఈ నేపథ్యంలో రాయి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని ఓ నిర్ణయానికి వచ్చింది. అంతేకాక, ఫోటో తీసిన రోవర్ డిఫరెంట్ యాంగిల్లో తీయడం వల్ల అచ్చం నిర్మించిన తలుపు ఆకారంలా కనిపించిందని వెల్లడించింది. చూడ్డానికి తలుపులాగా కనిపించినా వాస్తవానికి దాని సైజు సెంటీమీటర్లలోనే ఉంటుందని స్పష్టం చేసింది. అంగారక గ్రహంపై ఇలాంటివి ఎన్నో ఉన్నాయని, అవేంటో పూర్తిస్థాయిలో తెలియడానికి మరింత పరిశోధనలు అవసరమని పేర్కొంది.