NASA released video of Cyclone Ion
mictv telugu

హరికేన్ తుఫాన్.. స్పేస్ నుంచి తీసిన వీడియో విడుదల చేసిన నాసా

September 30, 2022

NASA released video of Cyclone Ion

అమెరికాలోని ఫ్లోరిడాపై హరికేన్ తుఫాన్ ఇయాన్ బుధవారం విరుచుకుపడింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన గాలుల వేగానికి చెట్లు, ఇళ్ల పైకప్పులతో పాటు మనుషులు కూడా కొట్టుకుపోయారు. 20 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

తుఫాన్ ధాటికి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే సముద్రంలో ఉండాల్సిన ప్రమాదకర షార్క్ చేపలు షాపింగ్ మాల్స్‌, వీధుల్లో ఈత కొడుతూ కనిపించాయి. వాటికి సంబంధించిన దృష్యాలు ఇప్పిటికే సోషల్ మీడియాలో వచ్చేశాయి. ఇదిలా ఉంటే ఆ దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా స్పేస్ నుంచి తుఫాన్ విరుచుకుపడుతున్న దృష్యాలను రికార్డు చేసింది. ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్ నుంచి తీసిన ఈ వీడియోలో తుఫాను విరుచుకుపడుతున్న భయంకర దృష్యాలను చూడవచ్చు. ఈ స్పేస్ స్టేషన్ భూమి నుంచి 258 మైళ్ల ఎత్తులో (415 కిలోమీటర్లు) ఉంది. నాసా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన ఈ వీడియోను ఇప్పటివరక 9 మిలియన్ల వ్యూస్ రాగా, 6 మిలియన్ల మంది లైక్ చేశారు. వీడియో చూస్తే భయమేస్తుందంటా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.